రాజీనామా చేస్తే మంచిది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఇండియన్‌ఎక్స్‌ప్రెస్ జర్నలిస్టు శివాని భట్నాగర్ హత్య కేసుతో ఇద్దరుసీనియర్ మంత్రులకు సంబంధం ఉన్నదనే ఆరోపణలపై స్పందించాలనిసీనియర్ కాంగ్రెస్ నేత పి.ఆర్. దాస్‌మున్షీ శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రమోద్ మహాజన్ మంత్రి పదవికి రాజీనామా చేస్తే బాగుంటుందని ఆయన అన్నారు.
తాను మహాజన్ స్థానంలో ఉండి వుంటే, కేసు దర్యాప్తు ముగిసేంత వరకు తాను రాజీనామా చేసి వుండేవాడినని ఆయన తన వ్యక్తిగత హోదాలో వ్యాఖ్యానించారు. తీవ్రవాదులపై పోరాటం గురించి నిరంతరం మాట్లాడే ఉప ప్రధాని అద్వానీఆర్.కె. శర్మను అరెస్టు చేయించడంలో విఫలం కావడం దురదృష్టకరమని దాస్‌మున్షీ అన్నారు.












Click it and Unblock the Notifications
