హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రిస్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి యువతకు ఆదర్శప్రాయుడని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. కోట్లవిజయభాస్కర్ రెడ్డి 83వ జయంతి శనివారం ఆయన నివాసంలో నిరాడంబరంగా జరిగింది.
విజయభాస్కర్ జయంతి కార్యక్రమానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) నాయకుడు ఎం. సత్యనారాయణ రావు, ఎఐసిసి అధికార ప్రతినిధి ఎస్. జైపాల్ రెడ్డి, తదితర కాంగ్రెస్ నాయకులుహాజరయ్యారు. విజయభాస్కర్ రెడ్డి గొప్ప పరిపాలనాదక్షుడని, దీక్ష దక్షతలున్న నేత అని కాంగ్రెస్ నాయకులన్నారు. మచ్చ లేని నాయకుడని, నేటి రాజకీయ నాయకులువిజయభాస్కర్ రెడ్డి నుంచి స్ఫూర్తి పొందాలని వారన్నారు.