హైదరాబాద్‌ః భూమి కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో సినీ నటుడు మహర్షిని బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం నాడు అరెస్టు చేశారు.
రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందుహాజరుపర్చగా ఈ నెల 22 వరకు రిమాండ్‌లో వుంచాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. మహర్షి బెయిల్ దరఖాస్తును కూడా ఆయన తిరస్కరించారు. దొరైస్వామి అనే వ్యక్తి నుంచి భూమిని కొనుగోలు చేసిన మహర్షి ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన డబ్బు చెల్లించలేదని పోలీసులు తెలిపారు. డబ్బులు చెల్లించకుండానే భూమినిస్వాధీనం చేసుకున్న మహర్షి డబ్బులు అడిగిన దొరస్వామిని బెదిరించారని దీనిపై దొరైస్వామి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆయన్నుఅరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు.