ప్రతిపక్షాల దుష్ప్రచారం: అద్వానీ
న్యూఢిల్లీ: తనను, కేంద్ర మంత్రులు ప్రమోద్ మహాజన్, అనంతకుమార్, రామ్‌నాయక్‌లను, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని లక్ష్యంగా ఎంచుకుని ప్రతిపక్షాలు వ్యక్తిత్వ హత్యకు, నిస్పృహతో కూడిన దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీవిమర్శించారు.
పెట్రోల్ పంపుల, భూమి కేటాయింపుల విషయంలో చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఆయన అన్నారు. బిజెపిని గద్దె దించలేమని, అది స్థిరపడిపోయిందని గుర్తించిన ప్రతిపక్షాలు దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని అద్వానీ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు ఎన్నో అవకతవకలకు పాల్పడ్డాయని, అవి కోర్టుల ద్వారా, రిట్ పిటిషన్ల ద్వారా బయటకు వచ్చాయని, వ్యక్తిత్వ హత్యకు, దుష్ప్రచారానికి పాల్పడడం వల్లఒరిగేదేమీ వుండదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
