ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం: బిజెపి
న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఇప్పుడే ఎన్నికలు నిర్వహించరాదనే ఎన్నికల కమీషన్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసేవిషయమై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికార ప్రతినిధిఅరుణ్ జైట్లీ చెప్పారు. ఎన్నికల కమీషన్ నిర్ణయం రాజ్యాంగ సందిగ్దాన్ని కల్పించిందని ఆయన శనివారంవిలేకరులతో అన్నారు.
శాసనసభను ఒకసారి రద్దు చేసిన తర్వాత 174వ ఆర్టికల్ ప్రకారం తిరిగి ఆరు నెలల లోపల కొత్త శాసనసభ ఏర్పడాలని, ఎన్నికల కమీషన్ నిర్ణయం రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకమని ఆయన అన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ఫిబ్రవరిలో ప్రకటించినట్లు, తుది జాబితాను మేలో ప్రకటించినట్లు ఆయన చెబూతు ఓటర్ల జాబితా సరిగా ఉందో లేదో పరిశీలించడమే ఎన్నికల కమీషన్ విధి ఆయన అన్నారు.
ఎన్నికల కమీషన్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయకూడదని కేంద్ర న్యాయశాఖా మంత్రి, బిజెపి మాజీ అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి అన్నారు. ఎన్నికల కమీషన్ నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, అయితే ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయడంసరైంది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
