ఆంధ్రలో పెట్టుబడులకు జపాన్ ఆసక్తి
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులుపెట్టేందుకు జపాన్ ప్రభుత్వం ఆసక్తిగా వున్నదని భారత్ లో జపాన్ రాయబారి హిరోషి హరబమండి అన్నారు. శనివారం ఆయన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రంగరాజన్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రగతి సాధించిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పర్యాటకరంగంలో పెట్టుబడులుపెట్టేందుకు జపాన్ ఆసక్తిగా వున్నదని, ముఖ్యంగా బౌద్ధ ఆరామాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
