కేంద్రంపై మండిపడ్డ శేషన్
షిమోగాః గుజరాత్ లో వెంటనే ఎన్నికలు జరపరాదంటూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతికి నివేదించాలనే వాజ్‌పేయి ప్రభుత్వం నిర్ణయంపై మాజీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి టి.ఎన్. శేషన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని శేషన్ షిమోగాలోవిలేకర్లతో అన్నారు. గుజరాత్ లో ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు రాష్ట్రపతి జోక్యం చేసుకున్నా ప్రయోజనం ఏముంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
జరపాలని పట్టుపట్టడం వల్ల వాజ్ పేయి ప్రభుత్వం అప్రతిష్ఠపాలు కావడం ఖాయం అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
