విద్యాసాగర్ సభలో గలభా
అనంతపురంః కేంద్ర హోం శాఖ సహయమంత్రి పాల్గొన్న సభలో కొందరువిద్యార్థులు రభస సృష్టించి కలకలం సృష్టించారు. సోమవారం అనంతపురంలో కేంద్రీయ పాఠశాల ప్రారంభ సభలోవిద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఇటీవల వెలుగుచూసినపెట్రోల్ బంకుల కుంభకోణంతో ప్రమేయం వున్నవిద్యాసాగర్ రావు రాజీనామా చేయాలని కోరుతూ కొందరు యువకులు సభలోనే నినాదాలు ఇచ్చారు. వారిని శాంతపరిచేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వారిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్ళారు.












Click it and Unblock the Notifications
