న్యూఢిల్లీ: కొత్త చీఫ్‌విజిలెన్స్ కమీషనర్ (సివిసి)గా పెజావర్ శంకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని వాజ్‌పేయి నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోపి. శంకర్‌ను సివిసిగా ఎంపిక చేశారు.
ఈ సమావేశానికి ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీహాజరయ్యారు. శంకర్ తమిళనాడుకు చెందిన 1966 క్యాడర్ ఐఎఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ప్రణాళిక సంఘం కార్యదర్శిగా ఉన్నారు. వచ్చే నెల 2వ తేదీన ప్రస్తుత సివిసి ఎన్.విఠల్ పదవీ విరమణ చేస్తున్నారు. ఈయన స్థానంలో శంకర్ పదవీ బాధ్యతలు చేపడతారు. నాలుగేళ్ల పాటుఆయన ఈ పదవిలో ఉంటారు.