మహాజన్ మాయలోడుః మధుశర్మ
పంచకల్‌ః జర్నలిస్టు శివాని భట్నాగర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ఐ.టి.శాఖ మంత్రి ప్రమోద్ మహాజన్ లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలని మధుశర్మ డిమాండ్ చేశారు. శివాని హత్య కేసులో ప్రధాన నిందితుడు, హర్యానా కేడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి రవికాంత్ శర్మ సతీమణి మధుశర్మ తన భర్తను ఈ కేసులో ఇరికించారని ఆరోపించడంతో పాటు ప్రమోద్ మహాజన్ పై తీవ్రమైన ఆరోపణలు చేసినవిషయం విదితమే.
రవికాంత్ శర్మ తనకు తెలియదని, శివాని హత్య జరగడానికి ముందు 1999 జనవరిలో శివనీతో సుదీర్ఘంగా మాట్లాడినవిషయాన్ని కూడా ఆయన ఒప్పుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఢిల్లీ పోలీసులుమినహా మరెవరైనా లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించవచ్చునని ఆమె చెప్పారు. ఇదిలా వుండగాఆర్. కె. శర్మ పెద్ద కుమార్తె ప్రగతి శర్మ మరోసారి మానవహక్కుల కమిషన్ కు వెళ్ళి తన కుటుంబం మొత్తానికి రక్షణ కల్పించాల్సిగావిజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications
