హైదరాబాద్: హైదరాబాద్‌లోని మాదన్నపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఒక మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకుగురైంది. ఆమె ఇంటికి తరుచూ వచ్చి వెళ్లే బంధువుపై, భర్తపై అనుమానాలు వ్యక్తమతున్నాయి.
సోమవారం మహిళా కానిస్టేబుల్ రాధ డ్యూటీ చేసి ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందీ తెలియదు. రాధ మృతి చెంది పడి ఉన్నట్లు ఆమె దూరపు బంధువు కృష్ణారెడ్డి పోలీసులకు సమాచారంఅందించాడు. రాధ డ్యూటీ ముగించుకుని వచ్చినప్పటి నుంచి కృష్ణారెడ్డి ఆమెతోనే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. తమ కూతురు రాధను ఆమె భర్త యాకూబ్ రెడ్డి తరుచు మానసికంగా, శారీరకంగా హింసించే వాడని ఆమె తలిదండ్రులువినోద, కేశారెడ్డి ఆరోపిస్తున్నారు. యాకూబ్ రెడ్డియే ఈ హత్య చేసి ఉంటాడని వారంటున్నారు. రాధను గొంతి నులిమి చంపేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతురాలి భర్త యాకూబ్ రెడ్డిని, ఆమె దూరపు బంధువు కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కృష్ణారెడ్డి సిబిసిఐడిలో పని చేస్తున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన కేశారెడ్డి కుమార్తెసిహెచ్. రాధిక (35) 12 ఏళ్లుగా సిసిఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. 14 ఏళ్ల క్రితం ఆమెకు మాదన్నపేటకు చెందిన ఆటో డ్రైవర్ యాకూబ్ రెడ్డితోపెళ్లయింది.