అగర్తాల: మిలిటెంట్లు మంగళవారం ఉదయం మెరుపుదాడి చేసి హీరాపూర్‌లో త్రిపురస్టేట్ రైఫిల్స్‌కు చెందిన 19 మంది జవాన్లను హత్య చేశారు. ఈ సంఘటనలో మరో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.
తమ సహచరుడినిఅగర్తాలలోని జి.బి. ఆస్పత్రికి తీసుకెళ్తున్న వాహనానికి ఎస్కార్ట్‌గా వెళ్తున్న జవాన్ల వాహనంపైమిలిటెంట్లు బుల్లెట్లు కురిపించారు. గాయపడిన వారిని జి.బి. ఆస్పత్రిలో చేర్చారు. జవాన్లకు చెందినసెల్ఫ్ లోడింగ్ రైఫిళ్లను, లైట్ మిషన్ గన్‌లను, భారీ ఆయుధ సామగ్రిని తీసుకెళ్లారు. పోలీసు, పారామిలటరీ బలగాలు సంఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరి వెళ్లాయి.మిలిటెంట్ల కోసం గాలింపు చేపట్టారు.