ప్రత్యామ్నాయ జట్టులో శ్రీనాథ్,ప్రసాద్
న్యూఢిల్లీ: శ్రీలంకలో జరిగే ఐసిసి ఛాంపియన్ ట్రోఫీకి ఎంపిక ప్రత్యామ్నాయ జట్టులో ఫాస్ట్ బౌలర్లు శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్ ఉన్నారు. ఆల్ రౌండర్ రాబిన్ సింగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. కాంట్రాక్టుపై సంతకాలు చేయడానికి ప్రస్తుతం ఇంగ్లాండు పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు సభ్యులు నిరాకరించడంతో బిసిసిఐసెలెక్షన్ కమిటీ 25 మంది ప్రొబబుల్స్‌ను ఎంపిక చేసింది. ఇందులో నుంచి 13 మందితో జట్టును కూడా ఎంపిక చేసింది.
ప్రొబబుల్స్ జాబితా: ఎస్. రమేస్, గౌతమ్ గంభీర్, గగన్ ఖోడా, డేనియల్ మనోహర్, కాన్నర్‌విలియమ్స్, హేమంగ్ బదానీ, రోహన్ గవాస్కర్, జాకబ్ మార్టిన్, హృషికేశ్ కనిట్కర్, రీతిందర్ సింగ్ సోధి, జె.పి. యాదవ్,విజయ్ భరద్వాజ్, రాకేష్ పటేల్, శరణ్‌దీప్‌సింగ్, మురళి కార్తిక్, రమేష్ పవార్, సైరాజ్ బహుతులే, జువగళ్ శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్, రాబిన్‌సింగ్, ఇర్ఫాన్ పఠాన్, ఎల్. బాలాజీ, దేవషీస్ మొహంతి, దీప్ దాస్‌గుప్తా, ఎంఎస్‌కె ప్రసాద్.












Click it and Unblock the Notifications
