గంగూలీ, కుంబ్లేతో మాట్లాడిన దాల్మియా
న్యూఢిల్లీః ఐసిసి ఒప్పందంపేరిట తమ చేతులు కాళ్ళు కట్టిపడేయాలనుకొనే బిసిసిఐ ప్రయత్నాలకు లొంగబోమని భారత జట్టులోనిసీనియర్ ఆటగాళ్లు భీష్మించారు. దీంతో బిసిసిఐ అధ్యక్షుడు దాల్మియా మెట్టు దిగక తప్పలేదు. తాజా పరిస్థితి గురించి దాల్మియా లండన్ లో వున్న గంగూలీ, కుంబ్లేతో నేరుగా మాట్లాడారు. లోగోల ఒప్పందంపై సంతకాలు చేసేందుకు బుధవారం మధ్యాహ్నం వరకు బిసిసిఐ గడువు ఇవ్వగా ఈ గడువువును ఆటగాళ్ళు పట్టించుకోలేదు. దీంతో శ్రీలంకలో జరిగే టోర్నీకి జూనియర్ ఆటగాళ్ళతో 20 మంది ప్రాబబుల్స్ ను బిసిసిఐ ఎంపిక చేసింది. అయితే వారిపేర్లను తెలివిగా ప్రకటించలేదు.












Click it and Unblock the Notifications
