ప్రభుత్వ భూమినిఅప్పగించిన వెంకయ్య
నెల్లూరు: తనపేరున పట్టా అయి ఉన్న 4.95 ఎకరాల భూమిని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. నెల్లూరు జిల్లా మంగళగుంటలో తాను భూకుంభకోణానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వెంకయ్యనాయుడు ఆ భూమిని ప్రభుత్వానికిఅప్పగించారు.
వెంకయ్యనాయుడు మామ అల్లూరు మస్తానయ్యకు 8.56 ఎకరాల ప్రయివేట్ పట్టా భూమి వుండడంపై కలెక్టర్‌వివరణ ఇస్తూ మస్తానయ్యకు గానీ, వెంకయ్యనాయుడు బావమరిది బాస్కర్ నాయుడికి గానీ ప్రభుత్వ భూమిని కేటాయించలేదని కలెక్టర్ స్పష్టం చేశారు. బిజెపి అధ్యక్షుడు వెంకయ్యనాయుడు గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ భూఆక్రమణలకు పాల్పడలేదని, వెంకయ్యనాయుడుకు 1978లో 4.95 ఎకరాల భూమి పంపిణీ జరిగిందని, ఆ సమయంలో వెంకయ్యనాయుడుకు భూమి లేదని నెల్లూరు జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఈ నెల 21నవివరించారు.












Click it and Unblock the Notifications
