జన్మభూమిపై చర్చకు సిద్ధం: టిడిపి
హైదరాబాద్: జన్మభూమిపై తాము కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డివిసిరిన ప్రతిసవాల్‌కు సిద్ధమేనని సమాచార, పౌర సంబంధాల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. జన్మభూమిపై చర్చకు సిద్ధమేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనకు ప్రతిస్పందిస్తూ తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని రాజశేఖర్ రెడ్డి ప్రతిసవాల్‌విసిరారు. దీనికి చంద్రమోహన్ రెడ్డి గరువారంవిలేకరుల సమావేశంలో ప్రతిస్పందించారు.
పనికి ఆహారం పథకం అమలులో అక్రమాలు జరగడం లేదని తాము అనడం లేదని, ఆ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
