రోడ్డుప్రమాదాల్లో 10మంది మృతి

కర్నూలుః కర్నూలు, బెంగుళూరు శివార్లలో శుక్రవాదం ఉదయం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పది మంది దుర్మరణం పాలయ్యారు. కర్నూలు జిల్లా గాజులపల్లి సమీపంలో ఒక లారీ అదుపుతప్పిన దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. నంద్యాల నుంచి గిద్దలూరు వెళుతున్న లారీ ఓ మలుపువద్ద అదుపు తప్పింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

మరో సంఘటనలో హెరిటేజ్‌ సంస్థకు చెందిన వ్యాన్‌ ఎదురుగా వస్తున్న వాహనాన్ని డీకొన్న దుర్ఘటనలో నలుగురు మరణించారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం బెంగుళూరు శివార్లలో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి సారధ్యంలోని హెరిటేజ్‌ ఫుడ్స్‌ వ్యాన్‌ పాలు తీసుకువెళుతుండగా ఈ దుర్ఘనట జరిగింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+