భీమవరంలో కొలువైన కమలనాధులు
రాజమండ్రిః రెండు రోజులపాటు జరిగే భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారంపశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చిలకం రామచంద్రరావు సారధ్యంలో సమావేశం జరుగుతున్నది. రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు వి. రామారావు, విద్యాసాగర్ రావు, సినీనటుడు కృష్ణంరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పనికి ఆహారపధకంలో జరుగుతున్న అవకతవకల పట్ల బిజెపి కార్యవర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అక్రమాలకు అడ్డు చెప్పాలనిసమావేశం సూచించింది.












Click it and Unblock the Notifications
