తలుపులు తెరిచే ఉంచాం: దాల్మియా
కోల్‌కత్తా: సీనియర్ క్రికెట్ క్రీడాకారులు ఐసిసి స్పాన్సర్‌షిప్ ఒప్పందంపై సంతకాలుచేయడానికి తలుపులు తెరిచే ఉన్నాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా అన్నారు. మా తలుపులు ఇంకా తెరిచే ఉంచాం అని ఆయన శుక్రవారం బెంగుళూర్ నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆయన అన్నారు.
ఇప్పటికే బిసిసిఐ 25 మందితో ప్రొబబుల్స్ జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో ఫాస్ట్ బౌలర్లు శ్రీనాథ్, వెంకటేష్ ప్రసాద్‌లు ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ జట్టుకు రాబిన్ సింగ్ నాయకత్వం వహిస్తాడని కూడా సమాచారం.












Click it and Unblock the Notifications
