ఎన్నికల ఆర్డినెన్స్‌ను తిప్పికొట్టిన కలాం

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం షాక్‌ ఇచ్చారు.వివాదాస్పద ఎన్నికల సంస్కరణల ఆర్డినెన్స్‌ ను కలాం తిప్పికొట్టారు. ఎన్నికల సంస్కరణ ఆర్డినెన్స్‌ లోని కొన్నిఅంశాలపై కలాం అటార్నీ జనరల్‌ సోలీ సొరాబ్జీని వివరణకోరారు. ఎన్నికలు ముగిశాక అభ్యర్థులు తమ ఆస్తులను ప్రకటించాలని ఎన్నికల సంస్కరణ ఆర్డినెన్స్‌ లో ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఎన్నికలకు ముందే రాజకీయ నాయకులు ఆస్తులను ప్రకటిస్తే తప్పేమిటని కలాం సోరొబ్జీని ప్రశ్నించారు.

వివాదాస్పాదమైన ఎన్నికల సంస్కరణల బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోఓ.కె. చేయించుకొనేందుకు ఎన్టీఏ ప్రభుత్వం నానా తంటాలు పడింది. అయితే ప్రతిపక్షాలు ససేమిరా అనడంతో ఆర్డినెన్స్‌ రూపంలో ఈ ఎన్నికల సంస్కరణలను అమలు చేయాలని భావించింది. ఈ ఆర్డినెన్స్‌ లో కొన్నిఅంశాలపై రాష్ట్రపతి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బిల్లును తిప్పి పంపడంతో బిజెపి తలపట్టుకుంది. రాష్ట్రపతి సందేహాలు వ్యక్తం చేయడం, వాటిని నివారణ చేసిన తరువాత ఆయన బిల్లును ఆమోదించడం సహజనమేనని బిజెపి సర్దిచెప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+