భూకబ్జా నిజం కాదు: వెంకయ్య

విశాఖపట్నం: నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో తాను భూకబ్జాకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం ఇక్కడికి వచ్చిన ఆయన కొద్దిసేపువిలేకరులతో మాట్లాడారు. నిజానిజాలు నిర్ధారణ చేసుకోకుండా నిందలు మోపడం సరి కాదని ఆయన అన్నారు. ఎక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు.

దేశం దక్షిణప్రాంతంలో పార్టీని బలోపేతం చేస్తామని ఆయనచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణాదిరాష్ట్రాల్లో రాజకీయంగా, సామాజికంగా పార్టీని విస్తృతపరుస్తామనిఆయన అన్నారు. వెనుకబడిన తరుగులవారు,ఎస్‌సిలు, ఎస్‌టిలు, మైనారిటీలను ఆకట్టుకోవడానికికార్యక్రమాలు చేపడుతామని ఆయన చెప్పారు.భూవాదంలోచిక్కుకొని కాస్త నీరసపడిన వెంకయ్య నాయుడికివిశాఖపట్నంలో శుక్రవారం ఘనస్వాగతంలభించింది. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైనతరువాత మొట్టమొదటి సారి ఆయన విశాఖవచ్చారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో విద్యార్ధిసంఘ నాయకుడిగా రాజకీయాల్లో ఆయనఓనమాలు దిద్దుకున్నారు. వెంకయ్య నాయుడురాక సందర్భంగా వేలాది మంది ప్రజలు,కార్యకర్తలు బారులు తీరి ఆయనకు స్వాగతంపలికారు.ఎయిర్‌ పోర్ట్‌ నుంచి సర్క్యూట్‌ హౌస్‌ వరకు 12 కిలోమీటర్ల పొడవునా వెంకయ్య బృందం ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీని బలోపేతం చేసేందుకు ప్రతిఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+