26న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఈ నెల 26వ తేదీన జరిగే అవకాశాలున్నాయి. చేర్పులు, మార్పులుస్వల్పంగానే ఉంటాయని భావిస్తున్నారు.
తాను శివసేన అధినేత బాల్ థాకరేతో మాట్లాడినట్లు,సురేష్ ప్రభు రాజీనామాను అంగీకరించాలని ఆయన గట్టిగా చెప్పినట్లు ప్రధాని వాజ్‌పేయి శుక్రవారంనాడువిలేకరులతో చెప్పారు. శివసేనకు చెందిన ఆర్థిక సహాయ మంత్రి అనంత్ గీతేకు క్యాబినెట్ హోదా కల్పించి ఆయనకువిద్యుచ్ఛక్తి శాఖను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. శివసేనకు చెందిన దళిత ఎంపి ఆనందరావు అద్సుల్‌కు మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశాలున్నాయి.
క్రీడల మంత్రి ఉమాభారతికి, ప్లానింగ్, పర్సనల్ శాఖల సహాయ మంత్రి వసుంధర రాజె సింథియాకు పార్టీ బాధ్యతలుఅప్పగించనున్నట్లు సమాచారం. ఆమెకు మధ్యప్రదేశ్ పార్టీ అధ్యక్ష పదవిని, వసుంధర రాజె సింథియాకు రాజస్థాన్ పార్టీ అధ్యక్ష పదవినిఅప్పగిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications
