నక్సల్స్ చెరలో 5గురు పోలీసులు
విశాఖపట్నం/ హైదరాబాద్: నక్సల్స్ చెరలో ఐదుగురు పోలీసులు ఉన్నారు.విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణ, చోడవరం పోలీసుస్టేషన్లపై నక్సల్స్ దాడి చేసి వాటిని పేల్చివేయడంతో పాటు ఐదుగురు పోలీసులను తమ వెంట తీసుకెళ్లారు. వారి జాడ శనివారం సాయంత్రానికి కూడా తెలియరాలేదు.పి. రమణ, చిట్టిబాబు, వెంకట్రావ్, అప్పారావు, శ్రీధర్ అనే పోలీసులు నక్సల్స్ చెరలో ఉన్నట్లు సమాచారం.వీరి కోసం కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అపాయం తలపెట్టకుండా వారిని వదిలిపెట్టాలని నక్సల్స్‌కువిజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, సంఘటనా స్థలానికి పోలీసు డైరెక్టర్ జనరల్‌పేర్వారం రాములు, ఇతర ఉన్నతాధికారులు వెళ్లినట్లు హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ శనివారం హైదరాబాద్‌లోవిలేకరులకు చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పోలీసుల విడుదల కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
