విశాఖలో పోలీస్టేషన్లుపేల్చేసిన నక్సల్స్
విశాఖపట్నంఃపీపుల్స్ వార్ నక్సలైట్లు శుక్రవారం రాత్రి విశాఖపట్నం జిల్లాలో చెలరేగిపోయారు. రెండు పోలీస్టేషన్లను ధ్వసం చేశారు. ఒక ట్రెజరీ కార్యాలయం కూడ నక్సలైట్లు ఆగ్రహానికి ధ్వంసమైంది. పోలీస్టేషన్ పై దాడిచేసిన నక్సలైట్లుపెద్ద ఎత్తున ఆయుధాలను ఎత్తుకెళ్ళారు. ముగ్గురు పోలీసులను కూడా కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళారు. నక్సలైట్లు ఈ స్థాయిలో చెలరేగిపోవడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం.
ఈ సంఘటనతో పోలీస్ యంత్రాంగం ఉలిక్కిపడింది. ప్రభుత్వంతో నక్సలైట్లు చర్చలపర్వానికి ఆదిలోనే హంసపాదు ఎదురైన విషయంవిదితమే. ఆ సమయంలో పోలీసులు రెచ్చిపోయి ఎన్ కౌంటర్లు చేయడంతో దెబ్బతిన్న నక్సలైట్లు ఇంతకాలం అదనుకోసం ఎదురు చూసి ఒక్కసారిగా రెచ్చిపోయారని భావిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన అనకాపల్లి, చోడవరం వెళ్లారు.












Click it and Unblock the Notifications
