న్యూఢిల్లీ: రక్షణ వ్యవహారాల కుంభకోణంలో తాము డబ్బులు ముట్టజెప్పిన జాబితాలోంచితెహెల్కా డాట్ కామ్ న్యూస్ పోర్టల్ సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీపేరును తొలగించింది. ఈ చర్య పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
వెంకటస్వామి కమీషన్ ముందు తెహెల్కా ఇన్వెస్టిగేషన్ ఎడిటర్ అనిరుధ్‌బహాల్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో జయాజైట్లీపేరు స్థానంలో సమతాపార్టీ రాజస్థాన్ శాఖ చీఫ్ గోపాల్ పచిర్వాల్‌పేరు చేర్చారు. ఇంతకు ముందు దాఖలు చేసిన జాబితాలో జయా జైట్లీకి రెండు లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలియజేశారు.