రాజమండ్రి: గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రిరైల్వే స్టేషన్‌లో కోటి రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లురైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.
ఇతర రైల్వేస్టేషన్లలో కూడా సౌకర్యాలను మెరుగుపరుస్తామని ఆయన చెప్పారు. గోదావరి పుష్కరాల కోసం వచ్చే యాత్రికుల కోసంవిశాఖపట్నం, రాజమండ్రిల మధ్య నడిచే 29రైళ్లకు 106 బోగీలను అదనంగా చేరుస్తామని ఆయన చెప్పారు. గోదావరి పుష్కరాలకు ఇంకా ఏడాది గడువు ఉంది. ఈ లోగా యాత్రికులకు తగిన సౌకర్యాలు కల్పిస్తామని ఆయన చెప్పారు.