న్యూఢిల్లీ: ఇండియన్‌ఎక్స్‌ప్రెస్ జర్నలిస్టు శివానీ భట్నాగర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఐపిఎష్ అధికార రవికాంత్ శర్మకు సంబంధించి తాము మరికొంత ప్రగతి సాధించామని ఢిల్లీ పోలీసులు ఆదివారం చెప్పారు.
రవికాంత్ శర్మ గురించి తమకు కీలకమైన ప్రగతి సాధించినట్లు, దర్యాప్తు అధికారులు ఈవిషయంలో ముందుకు సాగుతున్నారని వారు చెప్పారు. ఈ ప్రగతి ఏమిటనేది వివరించడానికి వారు నిరాకరించారు. తమకుఅందిన సమాచారం మేరకు ఉత్తరాంచల్‌కు, హిమాచల్ ప్రదేశ్‌కు, ఉత్తరప్రదేశ్‌కు, హర్యానాకు పోలీసు బృందాలను పంపినట్లు వారు తెలిపారు.