చెలరేగుతన్న హింస ప్రమాదం: సోనియా
గాంధీనగర్: గుజరాత్‌లో ద్వేషం, హింస వ్యాపించడం ఆవేదన కలిగిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ప్రపంచానికి అహింసను, శాంతి ప్రబోధించిన గుజరాత్‌లో ఈ విధమైన వాతావరణం నెలకొనడం బాధాకరమని ఆమె అన్నారు.
హింస మానవత్వానికి ప్రమాదకారిగా పరిణమించిందని, అవినీతి, మతోన్మాదం, తదితర సమస్యల మాదిరిగానే హింస కూడా భారతదేశానికి తీవ్రమైన సమస్యగా పరిణమించిందని ఆమె అన్నారు. కొన్నిస్వార్థ శక్తులు విభిన్న సమాజాల మధ్య విద్వేషాలను రెచ్చగొడతున్నాయని ఆమెవిమర్శించారు. రెండు భిన్న మతాలకు చెందిన వారి మధ్య ఈర్ష్యాద్వేషాలను ఏ మతం కూడా బోధించదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
