న్యూఢిల్లీ: ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సోమవారం తన మంత్రివర్గంలోస్వల్ప మార్పులు చేశారు. శివసేనకు చెందిన అనంత్ గంగారామ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ప్రస్తుతం ఆర్థిక శాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్నారు.
బిజెపి రాజ్యసభ సభ్యుడువిక్రమ్ వర్మను కేబినెట్ మంత్రిగా తీసుకున్నారు. శివసేనకు చెందిన వి. అద్సుల్ సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. వీరి చేత రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలామ్ రాష్ట్రపతి భవన్‌లోనిఅశోకాహాల్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయితో పాటు ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ, ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్‌హాజరయ్యారు.