ఇంగ్లాండుపై భారత్‌ ఘనవిజయం

లీడ్స్‌: ఇంగ్లాండుపై భారత్‌ మూడో క్రికెట్‌టెస్ట్‌ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో ఇంగ్లాండును ఓడించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండు 309 పరుగులకు అలవుట్‌అయింది. ఈ విజయంతో సిరీస్‌ను సమం చేసింది. ఇంతకు ముందు ఒక టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండు గెలిచింది. దాదాపు 24 ఏళ్ల తర్వాత భారత్‌ విదేశీ గడ్డపై గెలుపు సాధించింది. 1977-78 సిరీస్‌లో సిడ్నీటెస్ట్‌లో గెలిచింది. ఆ తర్వాత విదేశీ గడ్డపై ఇదేవిజయం. రాహుల్‌ ద్రావిడ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అతను 148 పరుగులు చేశాడు. రాహుల్‌ ద్రావిడ్‌ను గంగూలీ ప్రశంసలతో ముంచెత్తాడు. భారత బౌలర్లను కూడా అతను ప్రశంసించాడు.

ఇంగ్లాండు 239 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఐదో రోజు సోమవారం బ్యాటింగ్‌కు దిగింది. నాలుగువికెట్లు మాత్రమే కోల్పోయింది. సోమవారండెబ్బయ్‌ పరుగులు మాత్రమే జోడించి మిగతా ఆరువికెట్లను జారవిడుచుకుంది. ఇంగ్లాండు కెప్టెన్‌ నాజీర్‌ హుస్సేన్‌సెంచరీ చేసి కుంబ్లే బౌలింగ్‌లో అవుటయ్యాడు. హుస్సేన్‌ 110 పరుగులు చేశాడు. నాజిర్‌ హుస్సెన్‌ తర్వాత ఇంగ్లాండు బ్యాట్స్‌మెన్‌ ఎవరూ నిలదొక్కుకోలేకపోయారు. కుంబ్లే నాలుగువికెట్లు పడగొట్టాడు. గంగూలీ క్యాచ్‌ పట్టగా చివరివికెట్‌ను కుంబ్లే తీసుకున్నాడు. మ్యాచ్‌లో కుంబ్లే ఏడువికెట్లు తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో హర్బజన్‌,అగార్కర్‌, జహీర్‌ ఖాన్‌లు ఒక్కటేసి వికెట్లు తీసుకోగా, సంజయ్‌ బంగర్‌ రెండువికెట్లు తీసుకున్నాడు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+