ఇంకా నోరు విప్పనివీరప్పన్
బెంగుళూరుః కర్నాటక మాజీ మంత్రి నాగప్పను కిడ్నాప్ చేసిన గంధపు చెక్కల స్మగ్లర్‌వీరప్పన్ ఇంతవరకు తన డిమాండ్లు ఏమిటో ప్రకటించలేదు.వీరప్పన్ కోసం గాలిస్తున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ దళాలకు అదనంగా మరికొంతమంది బలగాలను పంపుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.తమిళనాడు సరిహద్దు గ్రామంలో నాగప్ప కిడ్నాప్ జరిగిన ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగప్ప కిడ్నాప్ కు నిరసనగా స్థానిక ప్రజలు తీవ్రఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. కర్నాటక డిజిపి భాస్కర్ ఇతర ఉన్నతాధికారులతో హుటాహుటిన చామరాజనగర్ కు తరలివెళ్ళారు.
కన్నడ సినీనటుడు రాజ్ కుమార్ ఆదివారం చామరాజనగర్ కు రావడంతో పోలీసులంతా ఆయన బందోబస్తులో నిమగ్నం అయివుండగావీరప్పన్ అతదను చూసి కిడ్నాప్ కు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. నాగప్ప కిడ్నాప్ తో కన్నడ కంఠీరవుడు రాజ్ కుమార్ తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకొని బెంగుళూరు తిరిగివెళ్ళరు.వీరప్పన్ రాజ్ కుమార్ ను గజనూరు ఫాం హౌస్ లో జూలై 30, 2000లో కిడ్నాప్ చేసి 106 రోజులు బందీగా వుంచుకున్నవిషయం విదితమే.












Click it and Unblock the Notifications
