రూ.810 కోట్లతో కరవు నివేదిక
హైదరాబాద్: రాష్ట్రంలో కరవు సహాయ చర్యలకు 810 కోట్ల రూపాయలుఅందించాలని కోరుతూ తయారు చేసిన నివేదికను రాష్ట్ర అధికారులు పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రతినిధులకు సమర్పించారు. ఫళనీ మాణిక్యం చైర్మన్‌గా ఈ పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రతినిధులు సోమవారం రాష్ట్రానికి వచ్చారు.
ఇప్పటికే విపత్తుల నివారణ నిధి నుంచి 163 కోట్ల రూపాయలు రాష్ట్రానికి విడుదల చేసినట్లు స్థాయి సంఘం ప్రతితినిధులు చెప్పారు. జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ నిధి నుంచి రాష్ట్రం అదనపు నిధులు అడుగుతోందని వారు చెప్పారు. త్వరలో కేంద్రానికి తమ నివేదికను సమర్పిస్తామని స్థాయి సంఘం చైర్మన్ పళనీ మాణిక్యం చెప్పారు.












Click it and Unblock the Notifications
