గోదావరి ఉగ్రరూపం-నలుగురు మృతి
రాజమండ్రిః అతివృష్టి, అనావృష్టి.... ఏది వచ్చినా కష్టమే. రాష్ట్రంమొత్తం నిన్న మొన్నటి వరకు అనావృష్టితో అల్లాడిపోయింది. ఇప్పడు రాష్ట్రంలోని నదీపరివాహక ప్రాంతాలు నదులుపొంగడంతో కష్టాల్లో పడ్డాయి. ముఖ్యంగా గోదావరి నది ఎగువన భారీవర్షాలు పడడంతో గోదావరి పరవళ్ళు తొక్కుతున్నది. ఉపనదులైన పెన్‌గంగ, ప్రాణహిత భీకరరూపం దాల్చాయి. ఆదిలాబాద్ డివిజన్ లో 20 వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. రాజమండ్రి బారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదసూచికకు
చేరువలోకి వచ్చింది. భద్రాచలం వద్ద వరదనీరు ఒక్కసారిగా విరుచుకుపడితే ఏం చేయాలని అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నది.












Click it and Unblock the Notifications
