నలుగురు పోలీసులను వదిలిన నక్సల్స్
విశాఖపట్నంః ఐదుగురు పోలీసులను బందీలుగా తీసుకువెళ్ళినపీపుల్స్ వార్ నక్సలైట్లు సోమవారం ఉదయం నలుగురిని విడుదల చేశారు. కానిస్టేబుల్ చిట్టిబాబును మాత్రం నక్సలైట్లు బందీగాపెట్టుకున్నారు. చిట్టిబాబు విడుదలకు నక్సలైట్లు ఎటువంటి డిమాండ్లు ఇంతవరకు చేయలేదు. శుక్రవారం అర్థరాత్రివిశాఖజిల్లాలో విరుచుకుపడిని నక్సలైట్లు నలుగురు కానిస్టేబుల్, ఒక హోం గార్డును కిడ్నాప్ చేసుకువెళ్ళారు.వీరితో పాటు భారీఎత్తున ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
చిట్టిబాబు విడుదల కోరుతూ సోమవారం అనకాపల్లి లో వివిధ వర్గాలు బంద్ నిర్వహించారు.స్వచ్ఛంద సంస్థలు చిట్టిబాబు విడుదల కోరుతూ ర్యాలీలు నిర్వహించాయి. చిట్టిబాబును కూడా మానవతా దృక్పథంతో విడుదల చేయాలని డిజిపిపేర్వారం రాములు కోరారు.












Click it and Unblock the Notifications
