సిబిఐపై ఒత్తిడి ఉండదు: వాజ్‌పేయి
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు బృందం(సిబిఐ), ఇతర రాజ్యాంగబద్ధమైన సంస్థల పనివిషయంలో ప్రభుత్వం ఒత్తిడి తేబోదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి స్పష్టం చేశారు. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌ను సంస్కరించడం ద్వారాపెద్ద, చిన్నచేపలను పట్టుకునేందుకు ఒక విధానాన్ని రూపొందించాలని సిబిఐకి ప్రభుత్వం సూచించిందని ఆయన అన్నారు.
సిబిఐ, ఇతర దర్యాప్తు సంస్థల స్వయంప్రతిపత్తిని కాపాడుతామని ఆయన చెప్పారు.స్వయంప్రతిపత్తి బాధ్యతను, జవాబుదారీతనాన్ని పెంచుతుందని ఆయన అన్నారు.ఆర్థిక సరీళకృత విధానాల అమలు తర్వాత ఆర్థిక మోసాలు, బ్యాంకు, స్టాక్ కుంభకోణాలు, నగదు అక్రమ చేరవేతలు,సైబర్ నేరాలు పెరిగాయని, ఈ విధానాలను జాతి వ్యతిరేక, ఉగ్రవాద సంస్థలకు నిధులు పంపడానికి ఉపయోగించుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
