గుజరాత్ పై ఇసికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీః గుజరాత్‌అసెంబ్లీ ఎన్నికల వివాదంపై సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.వీటితో పాటు గుర్తింపు పొందిన ఆరు జాతీయ రాజకీయ పార్టీలకు కూడా సుప్రీం నోటీసులు పంపింది. జస్టిస్ క్రిపాల్, జస్టిస్ ఖేరే, జస్టిస్ బాలకృష్ణన్, జస్టిస్‌అశోక్ భాన్, జస్టిస్ అరిజిత్ లతో కూడాని రాజ్యాంగ ధర్మాసనం కేసువిచారణ పర్వాన్ని గురువారం నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది.
గుజరాత్ ఎన్నికల విషయంలో వాదనను వినిపించేందుకు తమకు కూడా అవకాశం కల్పించాలని కొన్ని ప్రాంతీయపార్టీలు సుప్రీంనుకోరాయి. ప్రాంతీయపార్టీలకు కూడా అవకాశం ఇస్తే కేసు ఇప్పట్లో తెమలదని, జాతీయ పార్టీలకు మాత్రమే అవకాశం ఇస్తున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గుజరాత్ లో డిసెంబర్ వరకు ఎన్నికలు జరపరాదని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దీనిపై కేంద్ర క్యాబినెట్ రాష్ట్రపతి అభిప్రాయాన్ని కోరింది. ఎన్నికల సంఘం నిర్ణయంపై రాష్ట్రపతి కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. ఆ సందేహాలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. దానిపై సుప్రీంకోర్టువిచారణ జరుపుతున్న విషయం విదితమే.












Click it and Unblock the Notifications
