వీరప్పన్ చెరలోకర్నాటక మాజీమంత్రి
మైసూరుః గంధపుచెక్కలస్మగ్లర్ వీరప్పన్ మరోసారి పంజా విసిరాడు. కర్నాటకమాజీ మంత్రి హెచ్. నాగప్పను ఆయన ఆదివారంరాత్రి 10 గంటల సమయంలో కిడ్నాప్ చేశాడు.జనతాదళ్ (ఎస్) కు చెందిన నాగప్ప తమిళనాడుసరిహద్దులోని చామరాజ్ నగర్ జిల్లా కొమగేరెలోనితన స్వగ్రామంలో వుండగా వీరప్పన్ స్వయంగాఅనుచరులతో వచ్చి ఆయనను కిడ్నాప్ చేశారు.నాగప్ప తన పెద్దకుమారుడు పుట్టిన రోజువేడుకల్లో వుండగా గేటువద్ద కొందరు అనుమానంగాసంచరిస్తుండడంతో భయపడిన నాగప్ప అనుచరులుగేటు మూసేశారు. వెంటనే వీరప్పన్ ముఠా కాల్పులుజరిపి తలుపులు పగలగొట్టుకొని రంగంలోకి దిగారు.












Click it and Unblock the Notifications
