పెట్రోబంకుల రద్దుపై సుప్రీంస్టే
న్యూఢిల్లీఃపెట్రోలు బంకుల కేటాయంపులను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టుస్టే ఇచ్చింది. కేటాయింపుల వ్యవహారంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు రావడంతో 2000 సంవత్సరం జనవరి నించి కేటాయించిన డీలర్ షిప్ లన్నింటినీ ప్రధాని వాజ్‌పేయి రద్దు చేశారు. ఈ వ్యవహారం పెను వివాదానికి దారితీసింది. బుధవారం సుప్రీంకోర్టు ఇచ్చినస్టే ఉత్తర్వులు దేశవ్యాప్తంగా 2248 డీలర్లకు వర్తిస్తాయి. అయితే మరో 1298 డీలర్లకు ఈ తాత్కాలికస్టే వర్తించదని సుప్రీంకోట్లు తేల్చి చెప్పింది.
ఇంతకు ముందు వివిధ రాష్ట్రకోర్టులు ఇచ్చిన తీర్పులన్నీ రద్దయి సుప్రీంతీర్పు మాత్రమే చెల్లుబాటవుతుంది. ఈ కేసులకు సంబంధించిన తుదివిచారణ నవంబర్ 12న జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లక్షల రూపాయలు ముడుపులు చెల్లించుకొని సంపాదించిన డీలర్ షిప్ లను ప్రధాని ఓ కలంపోటుతో రద్దు చేయచడాన్ని డీలర్లు వివిధ కోర్టుల్లో సవాలు చేసినవిషయం విదితమే.












Click it and Unblock the Notifications
