చంద్రబాబుకు డిమాండ్లపై ఎన్టీఏ మౌనం!
న్యూఢిల్లీః ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ఆశతో జరిపిన ఢిల్లీ యాత్ర అనుకున్న ఫలితాలు సాధించలేదు. కరవు సాయం తదితర పలుప్రతిపదనలతో చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్ళారు. ఉదయం నుంచి రాత్రి వరకు కాళ్ళకు చక్రాలు కట్టుకొని మంత్రులందరినీ కలిశారు. రాష్ట్రపతికలాం ను కలిసి ఆంధ్రను సందర్శించాల్సిందిగాకోరారు. ఉపరాష్ట్రపతి షెకావత్ ను కలిశారు. ప్రధాని వాజ్‌పేయి, ఓ డజను కేంద్ర మంత్రులతో చంద్రబాబు బృందం భేటీఅయింది.












Click it and Unblock the Notifications
