చొరబాట్లపై ముషారఫ్ కొత్తపాట
ఇస్లామాబాద్‌ః కాశ్మీర్ సరిహద్దు నుంచి చొరబాట్లను నిరోధించేందుకు ప్రపంచదేశాలు తనకు ఎటువంటి గడువు విధించలేదని పాక్ సైనికాధ్యక్షుడు ముషారఫ్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి భారత్ నుంచేమరింత స్పందన అవసరం అని బిబిసికి ఇంటర్వ్యూలో ముషారఫ్ చెప్పారు. చొరబాట్లను ఆపేందుకు తనకు ఎవరూ... ఎటువంటి గడువు విధించలేదన్నారు. వాస్తవాధీన రేఖ వెంట ఏమీ చొరబాట్లు లేవని నేను చెప్పాను... వారు వున్నాయంటున్నారు... భారత్ నుంచి ఎంతకాలానికీ స్పందన రాకపోతే మేం మాత్రం ఏం చేస్తాం. కాశ్మీరీలకు న్యాయం చేయాలనే సత్సంకల్పాన్ని మనసులో వుంచుకొని ఎంతకాలం మౌనంగా ఊరుకోగలం అని ముషారఫ్ అన్నారు.












Click it and Unblock the Notifications
