హైదరాబాద్: సినీనటి ప్రత్యూష మృతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సిబిఐ) సమర్పించిన తుది నివేదికను రాష్ట్ర హైకోర్టు గురువారం పరిశీలించింది.
సిబిఐ, సిడిఎఫ్‌డి నివేదికలను క్షుణ్నంగా పరిశీలించే వరకు వాటిన బయట పెట్టకూడదని జస్టిస్ మోతీలాల్ బి. నాయక్, జస్టిస్ రోహిణిలతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. నివేదికలోని సందేహాలను కొన్నింటిని నివృత్తి చేసుకునేందుకు న్యాయమూర్తులు సిబిఐ అధికారులతో కొద్దిసేపు తమ చాంబర్‌లో సమావేశమయ్యారు. కేసును హైకోర్టు వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.