హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడినవారి సహాయం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి జోక్యంతో క్షతగాత్రులను హైదరాబాద్‌లోని నిజాం వైద్యవిజ్ఞాన సంస్థ (నిమ్స్)కు తరలించారు.
ఈ సంఘటనకు సంబంధించినవివరాలు ఈ విధంగా ఉన్నాయి- రెండు రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం వద్దపెళ్లి ట్రాక్టర్ ఒకటి బోల్తా పడింది. ఈ సంఘటనలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న 15 మంది గాయపడ్డారు. గాయపడినవారికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం వారినిపంపేశారు. అయితే గత రెండు రోజుల్లో గాయపడిన 15 మందిలో ఐదుగరుస్త్రీలు మరణించారు. దీంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈవిషయం తెలిసిన ముఖ్యమంత్రి క్షతగాత్రులను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించి, చికిత్స చేయించాల్సిందిగా స్థానిక అధికారులను ఆదేశించారు. దీంతో వారిని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.