హైదరాబాద్: స్కాటిష్ నగరం స్టిర్లింగ్‌లో జరిగిన కామన్‌వెల్త్ బౌలింగ్ పోటీల మాస్టర్స్ విభాగంలో గుంటూరుకు చెందినషేక్ అబ్దుల్ హమీద్ స్వర్ణం గెలుపొంది గ్రాండ్ డబుల్ సాధించాడు.
ప్రపంచవ్యాప్తంగా 12 మంది అగ్రశ్రేణి బౌలర్లు పోటీ పడిన మాస్టర్స్ విభాగం రౌండ్ రాబిన్ పోటీల్లో పోటీల్లో 8409 పాయింట్లతో తన రెండోస్వర్ణ పతకాన్ని హమీద్ గెలుపొందాడు. బుధవారం జరిగిన పోటీల్లో పురుషుల సింగిల్స్ విభాగంలో తొలిస్వర్ణాన్ని సాధించిన హమీద్ రెండు పతకం సాధించడంతో గ్రాండ్ డబుల్ సాధించినట్టయింది. రెండేళ్ల క్రితం హమీద్ సరదాగా బౌలింగ్ ఆటలో ప్రవేశించాడు. ఆ తర్వాత ఇది అతనికిసీరియస్ అయిపోయింది. న్యూఢిల్లీలోని 6లేన్‌హాట్‌షాట్ బౌలింగ్ సెంటర్‌లో వారానికి నాలుగు రోజులు హమీద్ సాధన చేస్తాడు.