ఆబ్కారీ పోలీసుల హింసకు వ్యక్తి బలి
ఖమ్మం: ఆబ్కారీ పోలీసులు చిత్రహింసలకు గురి చేయడంతో ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన వంకత్తుల వెంకన్న (39) అనే వ్యక్తి మృతి చెందాడు. గుడుంబా తయారు చేస్తున్నాడనే ఆరోపణతో వెంకన్నను పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. ఆ చిత్రహింసలకు అతను శుక్రవారంనాడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కోపోద్రిక్తులైన ప్రజలు ఆందోళనకు దిగారు. వెంకన్న మరణానికి బాధ్యులైన ఆబ్కారీసిఐ, ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లను కలెక్టర్‌అరవిందకుమార్ సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications
