కర్నాటకపై కదనానికి ఆంధ్ర సన్నాహం

హైదరాబాద్‌ః కర్నాటక ప్రభుత్వంపై కదనానికి ఆంధ్రప్రదేశ్‌ సన్నాహం చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ లోని రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కృష్ణ, తుంగభద్రపై కర్నాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ఐదు ప్రాజెక్టులు దిగువన వున్న ఆంధ్రప్రదేశ్‌ లోని ఆయకట్టు రైతులకు తీవ్ర నష్టం కలిగించేవిగా వున్నాయి. ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఆదివారం సచివాలయంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. కర్నాటకపై సుప్రీంకోర్టులో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే న్యాయపోరాటం సాగిస్తున్నది.

మన నోరు కొడుతూ ఎటువంటి క్లియరెన్స్‌ లు లేకుండా ఐదు ప్రాజెక్టులు నిర్మిస్తున్న కర్నాటక, మనం నిర్మిస్తున్న తెలుగుగంగ, ఎస్‌.ఆర్‌.బి.సి, ఎస్‌.ఎల్‌.బి.సి, భీమా, పులిచింతల ప్రాజెక్టులకు అభ్యంతరం చెబుతూ సుప్రీంకోర్టులో ఎదురుకేసులుపెట్టింది. దీనిపై గట్టిగా పోరాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకొనే ఎటువంటి చర్యలకైనా ప్రతిపక్షాలు మద్దతు ఇస్తాయని అన్ని పార్టీలు ప్రకటించాయి. పార్టీలకు అతీతంగా ఈఅంశంలో తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని కాంగ్రెస్‌, బిజెపి, వామపక్షాలు వెల్లడించాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+