పంచాయతీ రాజ్ మంత్రికిఎసరు!
కర్నూలుః పంచాయతీ రాజ్ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. పంచాయతీ రాజ్ శాఖలో రెండుకోట్లకుపైగా అక్రమాలకు పాల్పడి, శాఖను సొంతఆస్తిలా వాడుకుంటున్న మంత్రి అల్లుడిపై సత్వరం చర్య తీసుకోవాలని కోరుతూ వామపక్షాలు మంగళవారం కర్నూలు పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి. కర్నూలు, అనంతపురం, గుంటూరు పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయాల్లో స్టేషనరీ కొనుగోళ్ళలో సుమారు రెండు కోట్ల రూపాయల మేరకు అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.
కుంభకోణానికి బాధ్యత వహించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీనామా చేయాలని, అధికారులను బెదిరించి అవినీతికి పాల్పడుతున్న మంత్రి అల్లుడిపై చర్య తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి.












Click it and Unblock the Notifications
