హైదరాబాద్: హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ ప్రాంతంలో ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు. ఒక వృద్ధమహిళను, 14 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
ఈ వృద్ధ మహిళ, బాలిక ఇంటిలోని కింది అంతస్థులో నిద్ర పోతుండగా మంగళవారం తెల్లవారు జామున ఈ హత్య జరిగింది. కుటుంబంలోనిమిగతావారు పై అంతస్థులు నిద్ర పోతున్నారు. అభరణాల దుకాణానికిపైన కింది అంతస్థులో ఈ హత్య, దోపిడీలు జరిగాయి. హంతకులు 20 లక్షలవిలువ చేసే బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయారు. కుటుంబం గురించి బాగా తెలిసిన వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకులను పట్టుకోవడానికి డాగ్స్, క్లూస్‌టీమ్స్‌ను రంగంలోకి దించారు.