పొత్తులకు తెలంగాణా సమితి దూరం

హైదరాబాద్‌ః వచ్చే ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రసమితి ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని టిఆర్‌ఎస్‌ స్పష్టం చేసింది. ప్రత్యేక తెలంగాణా వాదనను మరుగు పరచేందుకే కాంగ్రెస్‌ పార్టీ విచిత్రమైన వాదనలు చేస్తున్నదని ఆ పార్టీ కన్వినర్‌ దేశినచినమల్లయ్య అన్నారు. ప్రత్యేక తెలంగాణా వాదనను పూర్తిగా సమర్థించకుండా రాష్ట్రాల పునర్విభజనకు రెండో కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరడం మోసపూరిత వ్యూహమని ఆయన విమర్శించారు.

తెలంగాణా సాధనకు కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని ఫోరంలుపెట్టినా ఆ పార్టీని ప్రజలు నమ్మరని, కాంగ్రెస్‌ తో టిఆర్‌ఎస్‌ చేతులు కలపదని మల్లయ్య తేల్చి చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌ లో సమావేశంఅయిన టిఆర్‌ఎస్‌ నేతలు పార్టీ వ్యూహాన్ని సమగ్రంగా చర్చించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+