ఆహారంలో అవినీతి-25మందిపై వేటు
చిత్తూరుః చిత్తూరు జిల్లాలో పనికి ఆహార పథకంలో అవినీతి జరిగిందని నిర్థారణఅయింది. పనికి ఆహారపథకంలో అవినీతికి పాల్పడిన 25 మంది అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం, కిమ్మనపల్లి తదితర ఆరు గ్రామాల్లో పనికి ఆహారపథకంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపైవిచారణ జరిగింది. ఈ విచారణలో ముగ్గురు ఎమ్మార్వోలు, నలుగురు ఎండిఓలు, 14 మంది గ్రామాకార్యదర్శులతో పాటు మరికొందరు అక్రమాలు పాల్పడినట్లు రుజువుకావడంతో వారిని సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications
