మిగిలిన మంత్రులు హరిశ్చంద్రులా?
హైదరాబాద్‌ః అవినీతికి పాల్పడిన మంత్రులందరిపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్య తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేసింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి శనివారంవిలేకర్లతో మాట్లాడుతూ అవినీతికి పాల్పడుతున్న మంత్రులుపై చర్య తీసుకోవడంలో కూడా చంద్రబాబు ఆశ్రితపక్షపాతం వహిస్తున్నారని ఆయనవిమర్శించారు.
నక్సలైట్ల సమస్య పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని సురవరం తప్పు పట్టారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
